SBI's new credit card saves you Rs 30,000 each year |
*SBI కొత్త క్రెడిట్ కార్డు.. తీసుకుంటే మీకు ప్రతి ఏడాది రూ.30,000 ఆదా.. పూర్తి వివరాలు!*
*ఎస్‌బీఐ ల్యాండ్‌మార్క్ గ్రూప్ కంపెనీతో భాగస్వామ్యంతో మూడు కొత్త క్రెడిట్ కార్డులను మార్కెట్లోకి తెచ్చింది. లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ ఎస్‌బీఐ కార్డు, మ్యాక్స్ ఎస్‌బీఐ కార్డ్, స్పార్ ఎస్‌బీఐ కార్డు అనేవి వీటి పేర్లు. కార్డు ప్రాతిపదికన మీరు పొందే ప్రయోజనాలు కూడా మారతాయి.*
*ఈ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డుల్లో మళ్లీ మూడు వేరియంట్లు ఉన్నాయి. బేస్, సెలెక్ట్, ప్రైమ్ అనేవి వీటి పేర్తు. వ్యాల్యూ ఫర్ మనీ దగ్గరి నుంచి ప్రీమియం, సూపర్ ప్రీమియం కస్టమర్ల వరకు ఈ కార్డ్స్ ద్వారా ప్రయోజనం పొందొచ్చు. ప్రైమ్ వేరియంట్ క్రెడిట్ కార్డు తీసుకున్నవారు సంవత్సరానికి రూ.30,000 వరకు ఆదా చేసుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది.
*ఎస్‌బీఐ కొత్త క్రెడిట్ కార్డు తీసుకున్నవారికి ల్యాండ్‌మార్క్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌కు కాంప్లిమెంటరీ లాయల్టీ మెంబర్‌షిప్ లభిస్తుంది. అలాగే ఇతర కొనుగోళ్లపై రివార్డు పాయింట్లు గెలుపొందొచ్చు. రూ.100 ఖర్చు చేస్తే గరిష్టంగా 15 రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఎస్‌బీఐ రివార్డు పాయింట్లను ల్యాండ్‌మార్క్ రివార్డ్స్‌గా మార్చుకొని, వీటి ద్వారా లైఫ్‌స్టైల్, హోమ్ సెంటర్, మ్యాక్స్, స్పార్ సహా ఇతర ల్యాండ్‌మార్క్ బ్రాడ్స్‌లో వీటిరి రిడీమ్ చేసుకోవచ్చు. మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.*
*క్రెడిట్ కార్డు ఫీజుల విషయానికి వస్తే.. బేస్ వేరియంట్ కార్డు జాయినింగ్ ఫీజు రూ.499గా ఉంది. దీనికి జీఎస్‌టీ అదనం. సెలెక్ట్ వేరియంట్ కార్డు తీసుకోవాలని భావిస్తే రూ.1,499 చెల్లించాలి. అదే ప్రైమ్ కార్డుకు అయితే రూ.2,999 ఫీజు ఉంది. రెన్యూవల్ చార్జీలు కూడా ఇలానే ఉన్నాయి.*
*క్రెడిట్ కార్డు తీసుకున్న వారికి వెల్‌కమ్ గిఫ్ట్ కింద ఉచితంగానే రివార్డు పాయింట్లు లభిస్తాయి. ప్రైమ్ కార్డుపై 12000 బోనస్ రివార్డు పాయింట్లు పొందొచ్చు. ఇవి రూ.3000కు సమానం. సెలెక్ట్ వేరియంట్ కార్డుకు 6000 బోనస్ పాయింట్లు (రూ.1500కు సమానం), బేస్ వేరియంట్‌కు 2000 బోనస్ రివార్డు పాయింట్లు (రూ.500 సమానం) వస్తాయి. ఇకపోతే వాహనదారులకు 1 శాతం ఫ్యూయెల్ సర్‌చార్జీ మినహాయింపు లభిస్తుంది. కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా ఉంటుంది.*