Important Things to Know in Fixed Deposit Banks |
Important Things to Know in Fixed Deposit Banks | బ్యాంకులలో ఫిక్సుడ్ డిపాజిట్ చేసేవారు తెలుసుకోవాల్చిన ముఖ్యమైన విషయాలు
దేశంలో చాలా మంది ఇంట్లో ఉన్న డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇతర ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ల గురించి పెద్దగా ఆలోచించరు. బ్యాంకులపై ప్రజల్లో ఉన్న విశ్వాసం ఇది. బ్యాంకులో డబ్బు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేటప్పుడు పలు విషయాలను గుర్తు పెట్టుకోవాలి.బ్యాంక్ ఎఫ్‌డీలకు సురక్షితరమైనవి. మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లలో ఎఫ్‌డీలు కూడా ఒక భాగం. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు దాదాపు 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఒక్కసారి డబ్బును ఎఫ్‌డీ చేస్తే.. ఐదేళ్ల తర్వాతనే తీసుకోగలం.
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తంపై వడ్డీ వస్తూనే ఉంటుంది. ప్రతి ఏడాది డిపాజిట్ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీ మీ అకౌంట్‌కు జమవుతూ వస్తుంది. అప్పుడు దీనిపై కూడా వడ్డీ వస్తుంది. అధిక ఎఫ్‌డీ రేట్లు ఉన్న బ్యాంక్‌లో డబ్బులు దాచుకుంటే ఎక్కువ రాబడి పొందొచ్చు. అందువల్ల ఏ ఏ బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్నాయో చూసుకోవాలి.
అకౌంట్ టైప్: ఫిక్స్‌డ్ డిపాజిట్లను సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఓపెన్ చేయవచ్చు. జాయింట్‌గా అకౌంట్ ఓపెన్ చేస్తే పన్ను ప్రయోజనాలు కేవలం ఒక్కరు మాత్రమే పొందగలుగుతారు.
వడ్డీ రేటు: బ్యాంక్ ప్రాతిపదికన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు మారతాయి. అంతేకాకుండా మీరు ఎన్ని రోజులు ఎఫ్‌డీలను కొనసాగించాలనే అంశంపై కూడా వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. వడ్డీ రేటు నెల వారీగా లేదా త్రైమాసికం చొప్పున చెల్లిస్తారు. దీన్ని రిఇన్వెస్ట్ చేయొచ్చు.
ట్యాక్స్: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ మొత్తానికి పన్ను వర్తిస్తుంది. ట్యాక్స్ స్లాబ్స్‌కు అనుగుణంగా మీరు చెల్లించే పన్ను మారుతుంది. అంతేకాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై టీడీఎస్ కూడా ఉంటుంది. బ్యాంక్‌కు ఫామ్ 15జీ లేదా ఫామ్ 15హెచ్ అందిస్తే టీడీఎస్ తప్పించుకోవచ్చు.
లోన్: బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణ సదుపాయం కూడా ఉంటుంది. ఎఫ్‌డీలపై లోన్ పొందొచ్చు. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో కొంత మొత్తం వరకే రుణాన్ని అందిస్తారు. బ్యాంక్ ప్రాతిపదికన రుణ మొత్తం మారుతుంది.