Showing posts with label NEWS. Show all posts
Showing posts with label NEWS. Show all posts

Wednesday, October 7, 2020

 

New Rules For Sim Cards | అన్ని SIM కార్డులపై 12 అక్టోబర్ 2020 నుండి కొత్త రూల్స్

Thursday, April 9, 2020


Coronavirus Impact on Recession | NTV Story Board | ముందుంది ఆర్థిక మాంద్యం

coronavirus,coronavirus news,coronavirus recession,coronavirus outbreak,recession,coronavirus pandemic, coronavirus update,coronavirus impact on recession,coronavirus china,coronavirus economic impact, coronavirus symptoms,global recession,coronavirus china economy,coronavirus latest, coronavirus latest news,coronavirus deaths,us coronavirus,economic impact coronavirus, coronavirus infection, coronavirus vaccine cure, coronavirus checks

Monday, March 16, 2020

యస్-బ్యాంకులో ఆ బ్యాంకులన్నింటికీ ఇక వాటా!

Other-Banks-Buying-Yes-Bank-Shares
కష్టాల్లో కూరుకుపోయిన యస్-బ్యాంకును దాదాపు టేకోవర్ చేస్తున్నాయి వివిధ బ్యాంకులు. ఒకవైపు యస్-బ్యాంకు కుంభకోణంపై కేంద్రం విచారణలు చేయిస్తూ ఉంది. దాని ఫౌండర్ అరెస్టయ్యాడు. అందుకు సంబంధించిన విచారణ సాగుతూ ఉంది. మరోవైపు బ్యాంకు ఖాతాదారుల కోసం కూడా ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటూ ఉంది. యస్-బ్యాంకు షేర్లను ఇతర బ్యాంకుల ద్వారా కొనిపించడానికి ఆర్బీఐ రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యస్-బ్యాంకుకు సంబంధించి 49 శాతం షేర్లను కొనుగోలు చేస్తూ ఉంది. ఇక యస్-బ్యాంకులోకి ఇతర బ్యాంకుల పెట్టుబడులు కూడా ఇప్పుడు ప్రవేశిస్తున్నాయి.

వాటి ప్రకారం..ఎస్బీఐ పెట్టుబడులు దాదాపు 7250 కోట్ల రూపాయలు. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ ఐసీఐసీఐ బ్యాంకులు చెరో వెయ్యి కోట్ల రూపాయల చొప్పున వెచ్చించి యస్-బ్యాంకు షేర్లను కొంటున్నాయి. ఇంకా యాక్సిస్ బ్యాంకు ఆరు వందల కోట్ల రూపాయలు కోటక్ మహీంద్రా బ్యాంకు ఐదు వందల కోట్ల రూపాయలు బంధన్ బ్యాంకు మూడు వందల కోట్ల రూపాయలు ఫెడరల్ బ్యాంకు మూడు వందల కోట్లు ఐడీఎఫ్సీ ఫస్ట్ రెండు వందల యాభై కోట్ల రూపాయల మొత్తాలను యస్-బ్యాంకు షేర్ల కొనుగోలు కోసం వెచ్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ రిలీఫ్ ప్యాకేజీ తో యస్-బ్యాంకు కొంతవరకూ మాత్రమే కోలుకునే అవకాశాలున్నాయి. కాగా యస్-బ్యాంకు మొత్తం మొండి బకాయిలూ దాదాపు 40 వేల కోట్ల రూపాయల వరకూ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. క్యూ3లోనే ఈ సంస్థ దాదాపు 18 వేల కోట్ల రూపాయల నష్టాలను చూపించింది. మొండి బకాయిలు పెరిగిపోవడం డిపాజిట్లు బాగా తగ్గిపోవడం నష్టాలకు కారణంగా పేర్కొంది.

Sunday, March 15, 2020

india-Mobile-phones-to-cost-more-as-GST-rate-hiked
సెల్ ఫోన్ మీద జీఎస్టీ బాదుడు..ఎంత పెరగనుందంటే?

సెల్ ఫోన్ మీద జీఎస్టీ బాదుడు..ఎంత పెరగనుందంటే?

మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా మారింది మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాల్ని చూస్తుంటే. ప్రభుత్వం తనకు వచ్చే పన్ను ఆదాయాన్ని పెంచుకోవటానికి.. తనకున్న అన్ని అవకాశాల్ని విపరీతంగా వాడేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 34 డాలర్లకు పరిమితమైనప్పటికీ.. పెట్రోల్.. డీజిల్ ధరలపై లీటరుకు మూడు రూపాయిల చొప్పున పెంచేస్తూ నిర్ణయం తీసుకోవటాన్ని మర్చిపోకూడదు.

ఇలాంటి బాదుడు మరిన్ని ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తూ తాజాగా జీఎస్టీ మండలి సరికొత్త నిర్ణయాల్ని ప్రకటించింది. సెల్ ఫోన్లపై ఇప్పటివరకు ఉన్న పన్ను భారాన్ని పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. సెల్ మరింత ఖరీదు ఎక్కనుంది.

కలకలం రేపుతున్న కరోనా పుణ్యమా అని.. చైనాలో చోటు చేసుకున్న పరిణామాలతో సెల్ ఫోన్ ధరలకు రెక్కలు వచ్చాయి. కనిష్ఠంగా ఐదు వందల నుంచి గరిష్ఠంగా మూడు.. నాలుగు వేల వరకూ ధరల్లో మార్పులు రాగా.. తాజాగా జీఎస్టీ మండలి ఏకంగా ఆరు శాతం పన్ను పోటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.

తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ప్రతి వందకు రూ.6 చొప్పు.. వెయ్యికి రూ.60 చొప్పున కొత్త భారం పడనుంది. పదివేల రూపాయిల ఫోన్ మీద కొత్త పన్ను ప్రకారం రూ.600 అదనపు భారం పడనుంది. నిత్యవసర వస్తువుగా మారిన సెల్ మీద పన్ను పోటును పెంచేయటమే కాదు.. సెల్ ఫోన్ విడిభాగాల మీదా పన్ను భారాన్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.

Wednesday, March 11, 2020

ED-Target-Yes-Bank-Rana-Kapoor-Delhi-Properties-worth-Rs-1000-Crore
YES బ్యాంక్ రాణా స్కెచ్ తెలిస్తే మతిపోవాల్సిందే ?

YES బ్యాంక్ రాణా స్కెచ్ తెలిస్తే మతిపోవాల్సిందే ?

భారతీయ ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థలో కొద్దికాలంగా అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన YES బ్యాంకు గత కొన్ని రోజులుగా సంక్షోభంలో పడిపోయింది. తాజాగా ఈ సంక్షోభం తీవ్రతరం కావడంతో ...బ్యాంకు నుండి అకౌంట్ హోల్డర్స్ డబ్బులు డ్రా చేయకుండా ..పరిమితులు విధించిన విషయం తెలిసిందే. అయితే అకౌంట్ హోల్డర్స్ కి ఇటువంటి భయం అక్కర్లేదు అని కేంద్రం ఆర్బీఐ ప్రకటించింది. అయితే YES బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో అనేక అనుమానాలు కలగడంతో YES బ్యాంకు వ్యవస్ధాపకుడు రాణా కపూర్ ని ఈడీ తమ కస్టడీలోకి తీసుకోని దర్యాప్తు మొదలుపెట్టింది.

ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయని సమాచారం. యస్ బ్యాంక్ కేసులో దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్న రాణా కపూర్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న క్రమంలో దేశ రాజధానిలో తన భార్య బిందూ కపూర్ పేరిట ఉన్న మూడు విలాసవంతమైన భవనాలను విక్రయించేందుకు రాణా కపూర్ ప్రయత్నాలు చేశారని తెలిసింది. రూ 4300 కోట్ల అనుమానిత లావాదేవీలు జరిగిన యస్ బ్యాంక్ వ్యవహారంలో బిందూ కపూర్ కూడా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.

ఢిల్లీలోని ప్రైమ్ లొకాలిటీలో 40 అమృత షెర్గిల్ మార్గ్ లోని భవంతిని బిందు బ్లిస్ అడోబ్ సంస్థ పేరిట కొనుగోలు చేశారు. బ్లిస్ విల్లా ప్రైవేట్ లిమిడెట్ పేరుతో ఢిల్లీలోనే మరో రెండు ఆస్తులను కొనుగోలు చేశారు. రూ 1000 కోట్ల విలువైన ఈ మూడు భవంతులను విక్రయించేందుకు తగిన పార్టీలను అన్వేషించాలని ఢిల్లీలోని కొందరు ప్రాపర్టీ డీలర్లను రాణా కపూర్ సంప్రదించినట్టు సమాచారం. తనపై ఈడీ దర్యాప్తు సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ముంబైలోని ఆస్తులను అమ్మి అమెరికా కాకుంటే బ్రిటన్ లేదా ఫ్రాన్స్కు మకాం మార్చాలని రాణా కపూర్ యోచించారని తెలిసింది. అలాగే దేశం విడిచి వెళ్ళేలోపు భారత్ లో ఉన్న ఆస్తులని విక్రయించుకోవాలని చూసారని చెబుతున్నారు. అయితే ఆ ప్రయత్నాలని ఈడీ సమర్థవంతంగా తిప్పికోట్టింది.

మరోవైపు అవంత రియల్టీ యస్ బ్యాంక్ కు చెల్లించాల్సిన రుణం బకాయి పడటం తో అదే సంస్థకు చెందిన అమృత షెర్గిల్ మార్గ్ లోని విలాసవంతమైన భవనాన్ని బిందు కపూర్ బ్లిస్ అడోబ్ కంపెనీ పేరిట కొనుగోలు చేయడం గమనార్హం. అవంత రియల్టీకి యస్ బ్యాంక్ రూ 500 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇక రుణ మొత్తాన్ని రికవర్ చేసేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించని యస్ బ్యాంక్ బ్లిస్ అడోబ్ కు కేవలం రూ 380 కోట్లకే కట్టబెట్టింది. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన అమృత షెర్గిల్ మార్గ్ లోని ఈ భవంతి విలువ రూ 450 కోట్లు పలుకుతుందని అనుకుంటున్నారు.

Tuesday, March 10, 2020

Jack-Ma-Crowned-Asia-s-New-Richest-Man
అంబానీ ఔట్.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా జక్ మా

అంబానీ ఔట్.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా జక్ మా

ఓ వైపు కరోనా ఎఫ్టెక్.. మరో వైపు ముడి చమురు ధరల పతనం తో ఈక్వెటీ షేర్లు కుప్పకూలడంతో ప్రపంచ కుబేరుల స్థానాలు మారిపోయాయి. ఇప్పటివరకూ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న భారత నంబర్ 1 కుబేరుడు ముకేష్ అంబానీ తాజాగా స్థానాన్ని కోల్పోయారు.

సోమవారం షేర్ మార్కెట్ కుదేలవడం తో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నికర సంపద విలువ ఏకంగా 580 కోట్ల డాలర్లు నష్టపోయాడు. దీంతో సంపద తగ్గిపోయింది. ఇక ఈ సమయంలో రెండో స్థానంలో ఉన్న అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా నంబర్ 1లోకి వచ్చారు. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ వివరాలు వెల్లడించింది.

ముఖేష్ అంబానీ కంటే జాక్ మా సంపద ఇప్పుడు 260 కోట్ల డాలర్లు ఎక్కువగా ఉంది. 4450కోట్ల డాలర్లతో జాక్ మా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.

కరోనా భయాలు వెంటాడడం.. 30 ఏళ్ల కనిష్ట స్థాయిలో ముడిచమురు ధరలు పడిపోవడం తో ప్రపంచంలోని మార్కెట్లన్నీ కుప్పకూలిన సంగతి తెలిసిందే.

Monday, March 9, 2020

Sensational Facts behind YES Bank Crisis | YES బ్యాంకు పై వెల్లడైన సంచలన నిజాలు

Saturday, February 15, 2020

China-closures-may-leave-e-commerce-shelves-empty.jpg
corona effect on Amazon - Flipkart

Amazon - Flipkart లపై కరోనా ఎఫెక్ట్..మరిన్ని ఇబ్బందులు?

ఇప్పటికే ఆన్ డెలివరీల విషయంలో జనాలు అలర్ట్ అవుతున్నారు. ఈకామర్స్ సైట్ల ద్వారా ఏదైనా ఆర్డర్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. కరోనా వైరస్ చైనాలో విజృంభిస్తూ ఉండటంతో - అక్కడ నుంచి ఏ సరుకునూ జనాలు డెలివరీ ఆర్డర్ ఇచ్చేందుకు సిద్దంగా లేరు. ఒకవేళ ఏదైనా ఆర్డర్ ఇచ్చినా.. ఇప్పుడు చైనా నుంచి సరకు దిగుమతి కూడా నిషేధం ఉన్నట్టుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు డెలివరీ లేనట్టే.

ప్రస్తుతానికి అయితే అదంతా ఒక ఎత్తు. కానీ ఈ నెలాఖరు తర్వాత  పరిస్థితి మరింత గడ్డుగా మారనుందని - ఈ కామర్స్ వెబ్ సైట్లకు అప్పుడే అందుకు సంబంధించి టెన్షన్ పెరుగుతూ ఉందని సమాచారం. ప్రత్యేకించి ఫోన్లు - ల్యాప్ టాప్ లు గట్రా ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో జనాలు ఈ కామర్స్ సైట్ల మీదే ఆధారపడుతూ ఉన్నారు. ఆన్ లైన్ లో ఆర్డరిచ్చి తెప్పించుకుంటున్నారు.

ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్ల విషయంలో అయితే ఇప్పుడు మరింత గడ్డుకాలం తప్పదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్లకు ప్రధాన ఆధారం చైనా. అక్కడే స్మార్ట్ విడి భాగాలన్నీ దాదాపుగా తయారు అవుతున్నాయి. వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది చైనా. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ రంగమే కీలకమైనది. ఇప్పుడు చైనా నుంచి ఇతర దేశాలకు విమానాలే సరిగా ఎగరడం లేదు. చైనా నుంచి వచ్చారంటే  మనిషిని కూడా పురుగును చూసినట్టుగా చూస్తున్నారు బయటి దేశాల వాళ్లు. అలాంటిది ఇప్పుడు చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే ధైర్యం చాలా మందికి లేదు. ఈ ప్రభావం మార్కెట్ మీద పడుతుందని ఆ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి చైనా నుంచి తెప్పించుకుని సరకు డెలివరీ  చేయాల్సిన పరిస్థితి లేదని -ఉన్న స్టాకు అంతా క్లియర్ అయ్యాకే. .ఆయా దేశాల్లో అసలు పరిస్థితి పై స్పష్టత వస్తుందని తెలుస్తోంది.

Tuesday, February 4, 2020

girlfriend-for-just-Rs--10

10 రూపాయలకే గర్ల్ ఫ్రెండ్

గర్ల్ ఫ్రెండ్ ... గర్ల్ ఫ్రెండ్ ... గర్ల్ ఫ్రెండ్ ..ప్రస్తుత యువత మొత్తం ఈ గర్ల్ ఫ్రెండ్ చుట్టూనే తిరుగుతున్నారు. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇక జీవితం లేనట్టు ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంటె ఒకరకంగా చూసేవారు. కానీ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేకుండా బయటకి పొతే ఒకరకంగా చుస్తూండటంతో ప్రతి ఒక్కరూ కూడా గర్ల్ ఫ్రెండ్ కోసం నానాకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా షాపింగ్స్ కి వెళ్ళేటప్పుడు పక్కనే గర్ల్ ఫ్రెండ్ ఉంటె వచ్చే ఆ కిక్కే వేరు అని చాలామంది అంటున్నారు. కానీ గర్ల్ ఫ్రెండ్ లేనివారు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటే బాగుంటుంది అని చాలాసార్లు అనుకునే ఉంటారు.

కానీ గర్ల్ ఫ్రెండ్ ఊరికే రారుకాదా. కానీ ఆలా గర్ల్ ఫ్రెండ్ లేని వారి కోసం తాజాగా ఒక సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 10 రూపాయలు చెల్లిస్తే చాలు..షాపింగ్ మాల్ లోనే మీకోసం గర్ల్ ఫ్రెండ్ లు రెడీగా ఉంటారు. మీకు నచ్చిన అమ్మాయిని గర్గ్ ఫ్రెండ్ గా సెలక్ట్ చేసుకుని వారితో కలిసి ఎంచక్కా షాపింగ్ చేసుకోవచ్చు. వారికీ ఇష్టమైతే వారితో మీరు డేట్ కి కూడా వెళ్ళచ్చు. సాధారణంగా బట్టల దుకాణం వ్యాపారాలు ..అమ్మకాలు బాగా పెరగాలి అని కొన్ని ఆఫర్స్ ని ప్రకటిస్తుంటారు. అలాగే చైనాలోని ఓ షాపింగ్ మాల్ కూడా ఇలాంటి విచిత్రమైన ఆఫర్ ప్రకటించింది. యువకుల కోసం గర్ల్ ఫ్రెండ్ లను అద్దెకు పంపుతోంది. గువాంగ్డాంగ్ ఫ్రావిన్స్ లోని హ్యూవాన్ సిటీలోని ది విటాలిటీ సిటీ షాపింగ్ మాల్ ఈ ఆఫర్ను ప్రకటించింది.

షాపింగ్కు ఒంటరిగా వచ్చే యువకులకు.. అమ్మాయిలను అద్దెకు ఇచ్చేందుకు వారి కోసం మాల్ ప్రత్యేక పోడియంలను నిర్దేశించారు. మాల్లోకి వెళ్లేముందు 20 నిమిషాలకు రూ. 10 అద్దె చెల్లించి పోడియం వద్దనున్న అమ్మాయిలను తోడుగా తీసుకెళ్లొచ్చు. సమయం దాటితే మాత్రం మన తో వచ్చిన యువతులు వెంటనే పోడియం వద్దకు వచ్చేస్తారు. మళ్లీ కావాలి అంటే పోడియం వద్దకి వెళ్లి డబ్బు చెల్లించి తెచ్చుకోవచ్చు. మనతో ఉన్న సమయంలో ఆ యువతులు షాపింగ్ లో ఏవైనా అనుమానాలు వస్తే సాయం చేస్తారు. అలాగే మనకి కావాల్సిన సహాయం కూడా చేస్తారు. గర్ల్ ఫ్రెండ్ లను లంచ్ డేట్కు తీసుకెళ్లే సౌకర్యాన్నికూడా మాల్ కల్పిస్తోంది. అయితే దానికోసం రెండు నిబంధనలు పెట్టారు. గర్ల్ఫ్రెండ్గా తీసుకెళ్లినవారిని ముట్టుకోకూడదు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంగణం దాటి ఎక్కడికీ తీసుకెళ్లకూడదంటూ నిబంధనలు కూడా ఉన్నాయి. అన్ని బాగున్నప్పటికీ ఈ నిబంధనలు పెట్టడం తో కొంతమంది యువత కొంత నిరుత్సహానికి గురౌతున్నారు.

Saturday, January 25, 2020

Amazon-Company-CEO-Jeff-Bezos-And-Wife-MacKenzie-Split
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం కొనసాగుతుండగానే ఇప్పుడు మరొక అంశం కొత్తగా వెలుగులోకి వచ్చింది. అసలు జెఫ్ బెజోస్ అతని భార్య విడిపోవడానికి కారణం బెజోస్ మరో మహిళతో నడుపుతున్న ప్రేమవ్యవహారమే కారణం అని ప్రపంచానికి తెలిసింది. జెఫ్ బెజోస్ మరో మహిళతో ప్రేమలో ఉన్న విషయం ఓ అంతర్జాతీయ పత్రికకు సమాచారం ఎలా వెళ్లిందనేదానిపైనే పై విచారణ జరగగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన భార్య మెకింజీతో గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విడాకులకు దారి తీసింది మాత్రం ఆయన ప్రేమ వ్యవహారమే. బెజోస్ ప్రేమిస్తున్న మహిళ లారెన్ శాంచెస్ అతనితో ఉన్న సంబంధం గురించి తన సోదరుడు మైఖేల్ శాంచెస్ గు చెప్పింది. అంతేకాదు వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్న సందర్భంలో చేసిన చాటింగ్ వివరాలను కూడా తన సోదరుడికి పంపింది. ఇదే అదనుగా తీసుకున్న మైఖేల్ నేషనల్ ఎంక్వైరర్ అనే ఓ అంతర్జాతీయ పత్రికకు డబ్బుల కోసం అమ్ముకున్నట్లు తెలుస్తుంది. భారీగా ఆ పత్రిక డబ్బులు ముట్టజెప్పడంతో వారి చాటింగ్ వివరాలను ఆ పత్రికకు ఇచ్చాడు. జెఫ్ బెజోస్ మరియు లారెన్ శాంచెస్ల మధ్య జరిగిన సంభాషణలను ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది వాల్ స్ట్రీట్ జర్నల్ సమీక్షించింది. అయితే బెజోస్ను బ్లాక్ మెయిల్ చేసే దిశగా నేషనల్ ఎంక్వైరర్ పత్రిక ప్రయత్నాలు ఏమైనా చేసిందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తన కథనంలో ప్రచురించింది.

ఇక బెజోస్ ఫోన్ హ్యాకింగ్ పై కూడా అమెరికా అటార్నీ కార్యాలయం విచారణ చేస్తోంది. 2018 మే 10వ తేదీన బెజోస్ మరియు లారెన్ల మధ్య జరిగిన సంభాషణలను గతేడాది జనవరి లో ఎంక్వైరర్ పత్రిక బయట పెట్టింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ వారి వ్యక్తిగత సంభాషణలను బయట పెట్టింది. ఇక 2018 జూలై 3వ తేదీన లారెన్ తన సోదరుడు మైఖేల్కు ఓ ఫోటోను పంపింది. అందులో జెఫ్ బెజోస్ ఒంటిపై చొక్కా లేకుండా అర్థనగ్నంగా ఉన్నాడు. ఇది కూడా ఎంక్వైరర్ ప్రచురించింది. 2019 ఫిబ్రవరి లో జెఫ్ బెజోస్ ఈ విషయంపై స్పందిస్తూ ఎంక్వైరర్ పత్రిక తనను బ్లాక్మెయిల్ చేస్తోందని చెప్పారు. తను లారెన్తో వ్యక్తిగతంగా ఉన్నసమయంలో ఫోటోలను బహిర్గతం చేస్తామంటూ ఆ పత్రిక తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని తెలిపారు.

Saturday, July 15, 2017


Saturday, July 25, 2015

Online లో చేసుకోవడానికి అనేక ఆదాయమార్గాలున్నాయి. అంతకంటే ఎక్కువుగా మోసపూరిత ప్రమాదాలు కూడా ఉన్నాయి. అత్యధికులు ఇటువంటి మోసకరమైన సైట్ల బారినుండి తప్పించుకోలేక ఇబ్బందులపాలయినవారు ఉన్నారు. దయచేసి చాలా జాగ్రత్త పదండి. Online Work అనేది కేవలం టైమ్ పాస్ కోసం అన్నవిధంగానే తీసుకోవడం మంచిది. ఇక ఇతరుల కోసం మీకు తెలిసిన నమ్మకమైన Online ఆదాయమార్గాలు ఏవైనా ఉంటే సూచించండి.

Saturday, November 22, 2014

యూట్యూబ్ లో మీరు వీడియోస్ అప్లోడ్ చేసి ఇతరులు వాటిని చూడడం ద్వారా సంపాదించడమే కాకుండా స్వయంగా మీరు చూడడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు.అదెలాగో మీకు తెలియాలంటే క్రింది వెబ్సైట్ కి వెళ్లి మీ ఈమెయిల్ తో ఒక యూజర్ ఐడి,పాస్ వర్డ్ క్రియేట్ చేసుకుని లాగిన్ కండి.అక్కడ వీడియోస్ ను వరసగా క్లిక్, సర్ప్ చేస్తూ తప్పనిసరిగా 30సెకన్ల వరకు వీడియో చూడాలి.30సెకన్ల టైమర్ అయిపోయాక వాలిడేట్ అయినట్లు టిక్ సింబల్ వస్తుంది. అప్పుడు మాత్రమే మీకు ఆ వీడియో చూడడం ద్వారా డబ్బులు క్రియేట్ అవుతాయి.డిఫాల్ట్ గా 0.05డాలర్లు (5సెంట్లు)మీ అకౌంట్లో ఉంటాయి.మరికొన్ని వీడియోస్ చూడడం ద్వారా 0.005(సగం సెంట్),మరికొన్ని వీడియోస్ 0.001(సెంట్ లో పదియవవంతు)వస్తుంది. సగటున రోజుకు 5సెంట్లు (3రూపాయలు) సంపాదించవచ్చును. మినిమం 10డాలర్లు సంపాదించాక పేపాల్ ద్వారా మన బ్యాంక్ ఖాతాకు మళ్లించుకోవచ్చు. ముందుగా మీరు క్రింది లింక్ క్లిక్ చేసుకుని సభ్యత్వం పొంది వర్క్ ప్రారంభించండి. తరువాత దీని ద్వారా మరింత భారీ మొత్తం నెల,నెలా ఎలా పొందాలో చక్కని ప్లాన్ చెప్తాను. అంతవరకూ శుభం.
Paid2YouTube.com

Saturday, November 15, 2014

నాకు తెలిసినవి,నేను సేకరించిన అన్ని విషయాలు మీకు తప్పకుండా తెలియజేస్తాను. వాటిని మీరు జాగ్రత్తగా సరి చూసుకుని ఫాలో అవ్వండి.(ముఖ్య గమనిక ఏమిటంటే ఈ బ్లాగులో ప్రక్కనున్నNotice Board చదవడం మర్చిపోవద్దు. దాని గుర్తు పెట్టుకోవడం కూడా మర్చిపోవద్దు.) ఆన్లైన్ లో సంపాదించాలంటే మనకి సరైన జాగ్రత్త తీసుకోవాలి. అంతేగాని ఇంత కట్టండి, అంత కట్టండి మీరు వేలకు..వేలు డాలర్లు సంపాదించుకోండి అనే ప్రకటనలు చూసి మోసపోవద్దు. మీలో స్కిల్ ఉండాలేగాని మీ నైపుణ్యంతో సంపాదించుకునే ఎన్నో అవకాశాలు మీ ముందున్నాయి. అవ్వన్నీ కూడా ఈ బ్లాగులోనే మీకోసం తెలియజేస్తాను. ఈ బ్లాగును మీరు తప్పకుండా సబ్ స్క్రైబ్ చేసుకోండి. గూగుల్ ప్లస్ తో కనెక్ట్ అవ్వండి. త్వరలో ఎన్నో విషయాలు మీరు తెలుసుకుంటారు. అంతవరకూ శుభం.అన్నట్టు చెప్పడం మరిచాను. ఈ లింక్ క్లిక్ చేసి సరదాగా ఆడుతు,పాడుతు వర్క్ చేయండి. ఉంటాను. మరో టపాతో కలుసుకుందాం.బై.

Friday, November 14, 2014

ఈ బ్లాగ్ ఆర్టికల్స్ పై విపులంగా చర్చించడానికి, మీ సందేహాలను నివృత్తి చేయడానికి, మీ ద్వారా మరిన్ని ఆన్లైన్ సంపాదనకు సంబధించిన సమాచారాన్ని తెలుసుకుని బ్లాగ్ పాఠకులకు తెలియజేయడం కోసం Help Line Blog  స్థాపించాను. ఇక నుండీ మీ సందేహాలు, సలహాలు, సూచనలను ఈ బ్లాగ్ ద్వారా తెలియజేయండి.

Sunday, August 24, 2014

  • 11:29 AM
  • Anonymous
ఇక నుండి ఈ బ్లాగులో ఆదాయానికి సంబంధించిన విషయాలు అందించబడతాయి.ఆన్ లైన్ లో ఎలా సంపాదించాలి అనే విషయాలతో పాటు, స్వంతంగా వ్యాపారం చేయడానికి ఏమి చెయ్యాలి? ఎలా మన వ్యాపారాన్ని విస్తరింప చెయ్యాలి? అనే సూత్రాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా అందించబడతాయి.ఈ బ్లాగును తప్పక ఫాలో అవండి.

Monday, November 11, 2013

సంప్రదాయంగా ఉద్యోగ నిర్వహణ ద్వారా ఆదాయం సంపాదించడం ఓ మార్గమనుకోండి ! మీరు ఒక కంపెనీ కోసం పని చేయడం ద్వారా గానీ, మీరే ఒక కంపెనీని ప్రారంభించడం ద్వారా గానీ ఆదాయం పొందడం సాధారణంగా జరిగేదే. ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటూ అధిక ఆదాయాన్ని సంపాదించేందుకూ మార్గాలున్నాయి. ఆన్‌లైన్‌లో ఆదాయం పొందాలంటే సృజనాత్మకత, చురుకుదనం, సమయానుకూల స్పందన ఉంటే చాలు... ఆపై దూసుకుపోవచ్చు..!

ధానంగా అత్యధిక మంది తమ కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేస్తారు. దానివల్ల భౌతికంగా ప్రతి ఒక్కరి మధ్య ఐక్యతతో ఒక్కొక్కరి ఆలోచనలను సమీకృతం చేసి సంస్థ అభివృద్ధికి వాటిని వినియోగిస్తారు.

అతికొద్ది మంది మాత్రమే తమ ఇంటి వద్ద నుంచే ఆదాయ సంపాదనకు మార్గాలు వెతు కుతుంటారు. ప్ర స్తుత ఆధునిక సమాజంలో అటువంటి మార్గాల్లో ఇంటర్‌నెట్‌, ఆదాయ సంపాదనకు పలు మార్గాలు ఉన్నాయి

కొద్ది సేపు పని చేసి స్వల్ప మొత్తంలో అదనపు ఆదాయం సంపాదించాలనుకునే వారికి కొన్ని సంస్థలు ఉపయుక్తంగా ఉంటాయి. అయితే ఇంటర్‌నెట్‌పై పూర్తిగా ఆధార పడి ఆదాయం సంపాదించిన వారి విజయ గాధలు కూడా గణనీయంగానే ఉన్నాయి. ఇంటర్‌నెట్‌ ద్వారా ఆదాయ సంపాదనకు అయిదు మార్గాలున్నాయి. ఇక ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లడమే.

ఈ - బేలో వస్తువుల విక్రయం

వెబ్‌సైట్‌ ద్వారా ఆదాయ సంపాదనకు ఆన్‌లైన్‌లో వస్తువుల విక్రయం ఒకటి. మీరు విక్రయించే వస్తువుల ఎంపికలో నిష్ణాతులు కావడమే ఇందులో కీలకం. నేరుగా ఆన్‌లైన్‌లో ప్రొఫైల్‌ సృష్టించుకుని వస్తు విక్రయం ప్రారంభించడమే. ప్రస్తుతం అందరికీ తెలిసిన దృక్పథమే ఇది. మీరు వస్తువుల పట్టికతో సిద్ధమైతే ఇదరులతో అవసరమే లేదు. ఇతరుల మాదిరిగా చాలా ఎక్కువ ధరలను నిర్ణయించకుండా ఆన్‌లైన్‌లో ఇ - బే వస్తువుల విక్రయానికి పెట్టడమే చేయాల్సింది. ఈ మార్గంలో ఫలితాలు రావడానికి కొద్దిగా సమయం పడుతుంది. ప్రేరణ కల్పించే విధంగా వస్తువుల జాబితా తయారు చేస్తే కొనుగోలు దారుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఆవెూద యోగ్యమైన బిడ్ల దాఖలుకు, అవసరమైన వినియోగదారులు కొనుగోలు చేయడానికి జాబితా తయారీ ముఖ్యం. అయితే ఆన్‌లైన్‌లో బుక చేసుకున్న తరువాత వినియోగ దారుడికి సకాలంలో వస్తువు పంపిణీ చేయడం ద్వారా సానుకూల పరిణామాలు ఏర్పడతాయి. కొనుగోలు దారులు తమ తోటి వారితో ఇ - బే విక్రయాల సమాచారం చేరవేయడం ద్వారా ప్రజా సంబంధాలు మెరుగవుతాయి. మీ వస్తువుల ధరలు, మీరు ఇచ్చే సర్వీసు కూడా కొనుగోలు దారులు తమ తోటి వారికి తెలియ చేయడం ఇ - బే వ్యాపారులకు లాభించే అంశం. తద్వారా ఆన్‌లైన్‌లో మీ విక్రయాలు వృద్ధి చెందుతాయి. ఇది నిరంతర ప్రక్రియగా సాగుతుంది.

బ్లాగింగ్‌

ఏదైనా చేయాలన్న తపన గానీ, అలవాటు గానీ, ఆలోచన గానీ ఉంటే బ్లాగింగ్‌ కూడా మీకు ఆదాయ మార్గమే అవుతుంది. ఇతర సర్వీసుల కంటే ఇంటర్‌నెట్‌లో బ్లాగింగ్‌ సేవల్లో కీలకమైందిదే. ఆన్‌లైన్‌లో వచ్చే వాణిజ్య ప్రకటనలను బ్లాగ్‌ విక్రయింప చేస్తుంది. అదెలా అంటే ..... మీరు వ్యక్తిగత బ్లాగ్‌ ఏర్పాటు చేస్తారు. గూగుల్‌యాడ్‌సెన్స్‌ తరహాలో పలువురు రచయితలు తమ బ్లాగ్‌లు సైన్‌అప్‌ చేసుకుంటారు. మీరు తరుచుగా బ్లాగ్‌ను సందర్శించి నప్పుడల్లా సదరు వెబ్‌సైట్లలో పేజీ పక్కన ఆయా స్పాన్సర్ల వాణిజ్య ప్రకటనలను చూస్తే స్పాన్సర్లెవ్వరూ అన్న విషయం తెలిసి పోతుంది. పలు దఫాలు మీ బ్లాగ్‌ను చదివే వారు ఆ పేజీ పక్కనే ఉన్న వాణిజ్య ప్రకటనను క్లిక చేయడం వల్ల ఆ ప్రకటనలోని వస్తువేమిటో తెలుసుకోవ డమూ ఒక రకమైన ప్రచారమే అవుతుంది. సాధారణ బ్లాగర్‌ అయిన మీరు మరింత డబ్బు ఖర్చు చేయడానికి ముందుకు వస్తే ఈ తరహా పనులన్నీ భేషుగ్గా ఉంటాయి. మీరు రాసే కథనాలతో మీ బ్లాగ్‌ నిరంతరాయంగా ఆసక్తి కలిగిస్తుంటే మీకు ఆన్‌లైన్‌లో ఉన్న అభిమానుల మనస్సు చూరగొనేందుకు వివిధ కంపెనీలు మీ ముందు క్యూ కడతాయి. మీ బ్లాగ్‌లో వాణిజ్య ప్రకటనలు జారీ చేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తాయి.

టి షర్టుల రూపకల్పన - విక్రయం
ఫోటో షాప్‌ వంటి ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా మీరు స్వంతంగా టి - షర్టులు రూపొందించండి. కొన్ని వెబ్‌సైట్లు మిమ్మల్ని సంప్రదించి ఆయా టి - షర్టుల డిజైన్లు తెలుసుకుంటాయి. మార్కెట్‌లో ఆ డిజైన్లతో కూడిన టి - షర్టుల విక్రయం తర్వాత వచ్చే లాభాలు మీకు పంచుతాయి. ఆఫ్‌బీట్‌ డిజైన్‌ వేసుకోవడానికి విద్యార్థులు, యువకులు ఆసక్తి కనబరుస్తుంటారు. మీరు ఒక స్కూల్‌ లేదా, కళాశాల క్యాంపస్‌కు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడితే కావాల్సినంత సమాచారం లభ్యమవుతుంది. ఈ సమాచారం పాఠ్య పుస్తకాల్లో గానీ, టర్మ్‌ ప్రశ్నా ప్రతాల్లో గానీ లభించదు. విద్యార్థులతో ఇష్టాగోష్టి నుంచి లభించే ఈ సమాచారానికి ఇంటి వద్ద పదును పెడితే కావల్సినన్ని డిజైన్లు లభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌లో టి షర్టుల విక్రయం క్రమంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కెఫెప్రెస్‌ డాట్‌ కామ్‌, స్ప్రెడ్‌షర్ట్‌ డాట్‌ కామ్‌ వంటి వెబ్‌సైట్లలో ఒక స్టోర్‌ ఏర్పాటు చేసుకుని, మీ డిజైన్లను విక్రయానికి పెట్టండి. మీకున్న తెలివి తేటలతో మీరు స్వయంగా తయారు చేసిన డిజైన్‌ పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందిస్తే చాలు మీకు ఆదాయం రావడం మొదలవుతుంది.

ఫ్రీలాన్సింగ్‌

ఫ్రీలాన్సింగ్‌ కూడా బ్లాగింగ్‌ వంటిదే. అయితే ఒక్క విషయం మీరు మీ ఇంట్లో గానీ, మీ ఆఫీసులో గానీ అత్యధిక సమయం పని చేస్తారు. అక్కడ కొన్ని విశిష్టతలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్‌ రైటింగ్‌ గురించి ఆలోచిస్తే బ్లాగర్‌కంటే ఎక్కువగా అనుభవం కలిగి ఉండాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ పబ్లికేషన్స్‌లో ఫ్రీలాన్సింగ్‌ రైటర్లు తమకు తెలిసిన విషయాల్లో ప్రత్యేకాంశాలను తీసుకుంటారు. ఆహారం, ప్రయాణం వంటి అంశాలను ఫ్యాషనేట్‌ పద్దతుల్లో యోచిస్తే ఎలా రాయాలన్న ఆలోచన తడుతుంది. తద్వారా ఫ్రీలాన్సింగ్‌ రచన ద్వారా ఆదాయం లభిస్తుంది. రచనలు మాత్రమే ఫ్రీలాన్సింగ్‌లో డబ్బు సంపాదించి పెట్టవు. గ్రాఫిక డిజైనింగ్‌ / ప్రోగ్రామింగ్‌ ఎక్సపీరియన్స్‌ కూడా కాంట్రాక్ట ఉద్యోగాలను తెచ్చి పెడతాయి.

డొమైన్‌ నేమ్‌ ప్లిప్పింగ్‌

చేయతలపెట్టిన వ్యాపారంలో అనుసరించే వ్యూహంతోపాటు అదృష్టాన్ని బట్టి విజయావకాశాలున్నాయి. ఆన్‌లైన్‌లో డొమైన్‌ పేరు గల వెబ్‌సైట్‌ కొనుగోలు కూడా డబ్బు సంపాదించే మార్గం. తక్కువ విలువ పలికే, పాత ఇళ్ల క్రయ విక్రయాల్లో ఆధునిక పోకడలతో వినియోగ దారులను ఆకట్టు కోవడం కీలకం. పాత ఇంటికైనా, తక్కువ ధర పలికే ఇంటికైనా ఆసక్తి గొలిపే రూపం కల్పించి అధిక ధరలకు విక్రయించడం.అయితే ఆన్‌లైన్‌లో కాలం చెల్లిన ఇల్లు, పాత ఇల్లు స్థానంలో ఒక వెబ్‌సైట్‌ 'మెయిల్‌ చిరునామా' కీలకం. వెబ్‌సైట్ల అన్వేషణలో ఉన్న వారు సరిగ్గా వినియోగించని, పేలవంగా వినియోగిస్తున్న వెబ్‌సైట్ల ఆచూకీ తెలుసుకుని, వాటి యజమానుల నుంచి సరసమైన ధరకు కొనుగోలు చేయడం. సాధారణంగా అటువంటి వారు కొన్ని వందల్లో (లేదా) వేల డాలర్లు చెల్లించి డొమైన్‌ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం వల్ల సదరు వెబ్‌సైట్‌ ద్వారా మరింత వాణిజ్యం వృద్ధి చేస్తారు. డొమైన్‌ పేరు గల వెబ్‌సైట్‌కు తొలి దశలో వచ్చిన ఆదాయానికంటే పలు రెట్లు ఎక్కువగా తీసుకు వస్తారు. ఉదాహరణకు బర్డ్‌ - కేజ్‌ డాట్‌ కామ్‌ అనే పేరున్న డొమైన్‌ వెబ్‌సైట్‌ 2005లో 1800 డాలర్లకు కొనుగోలు చేసి రీ డిజైన్‌ చేసిన రెండేళ్ల తర్వాత మరో బర్డ్‌ కేజ్‌ వెండర్‌కు 1.73 లక్షల డాలర్లకు విక్రయించారు.

Saturday, November 9, 2013

మీరు నెలకి 1000 రూపాయలు పైగా సంపాదించవచ్చు ఎలాగో చూడండి. రోజు కేవలం 3 నిముషాలు కేటాయించండి.ఎక్కువ ADS ఏమీ ఉండవు.కేవల్ం ఒక్కక్క వెబ్సైట్లో 4 ఉంటాయి.క్రింది బ్యానర్ పై క్లిక్ చేసిన వెంటనే ప్రక్కన న్యూ ట్యాబ్ లో ఆ సైట్ ఓపెన్ అవుతుంది.రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వండి.సైట్ లోని view ads క్లిక్ చేస్తే యాడ్స్ కనిపిస్తాయి.వాటిని క్లిక్ చేస్తూ ఉంటే మీ అకౌంట్ లో మని కలుస్తుంది.మినిమం పే అవుట్ అయిన వెంటనే మీ బ్యాంక్ కు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.అయితే paypal a/c తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి.ఎందుకంటే ఆన్ లైన్ మనీ paypal ద్వారానే పొందేవీలుంది.
..... ... ....

Recent Posts