Tuesday, February 4, 2020

girlfriend-for-just-Rs--10

10 రూపాయలకే గర్ల్ ఫ్రెండ్

గర్ల్ ఫ్రెండ్ ... గర్ల్ ఫ్రెండ్ ... గర్ల్ ఫ్రెండ్ ..ప్రస్తుత యువత మొత్తం ఈ గర్ల్ ఫ్రెండ్ చుట్టూనే తిరుగుతున్నారు. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇక జీవితం లేనట్టు ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంటె ఒకరకంగా చూసేవారు. కానీ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేకుండా బయటకి పొతే ఒకరకంగా చుస్తూండటంతో ప్రతి ఒక్కరూ కూడా గర్ల్ ఫ్రెండ్ కోసం నానాకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా షాపింగ్స్ కి వెళ్ళేటప్పుడు పక్కనే గర్ల్ ఫ్రెండ్ ఉంటె వచ్చే ఆ కిక్కే వేరు అని చాలామంది అంటున్నారు. కానీ గర్ల్ ఫ్రెండ్ లేనివారు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటే బాగుంటుంది అని చాలాసార్లు అనుకునే ఉంటారు.

కానీ గర్ల్ ఫ్రెండ్ ఊరికే రారుకాదా. కానీ ఆలా గర్ల్ ఫ్రెండ్ లేని వారి కోసం తాజాగా ఒక సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 10 రూపాయలు చెల్లిస్తే చాలు..షాపింగ్ మాల్ లోనే మీకోసం గర్ల్ ఫ్రెండ్ లు రెడీగా ఉంటారు. మీకు నచ్చిన అమ్మాయిని గర్గ్ ఫ్రెండ్ గా సెలక్ట్ చేసుకుని వారితో కలిసి ఎంచక్కా షాపింగ్ చేసుకోవచ్చు. వారికీ ఇష్టమైతే వారితో మీరు డేట్ కి కూడా వెళ్ళచ్చు. సాధారణంగా బట్టల దుకాణం వ్యాపారాలు ..అమ్మకాలు బాగా పెరగాలి అని కొన్ని ఆఫర్స్ ని ప్రకటిస్తుంటారు. అలాగే చైనాలోని ఓ షాపింగ్ మాల్ కూడా ఇలాంటి విచిత్రమైన ఆఫర్ ప్రకటించింది. యువకుల కోసం గర్ల్ ఫ్రెండ్ లను అద్దెకు పంపుతోంది. గువాంగ్డాంగ్ ఫ్రావిన్స్ లోని హ్యూవాన్ సిటీలోని ది విటాలిటీ సిటీ షాపింగ్ మాల్ ఈ ఆఫర్ను ప్రకటించింది.

షాపింగ్కు ఒంటరిగా వచ్చే యువకులకు.. అమ్మాయిలను అద్దెకు ఇచ్చేందుకు వారి కోసం మాల్ ప్రత్యేక పోడియంలను నిర్దేశించారు. మాల్లోకి వెళ్లేముందు 20 నిమిషాలకు రూ. 10 అద్దె చెల్లించి పోడియం వద్దనున్న అమ్మాయిలను తోడుగా తీసుకెళ్లొచ్చు. సమయం దాటితే మాత్రం మన తో వచ్చిన యువతులు వెంటనే పోడియం వద్దకు వచ్చేస్తారు. మళ్లీ కావాలి అంటే పోడియం వద్దకి వెళ్లి డబ్బు చెల్లించి తెచ్చుకోవచ్చు. మనతో ఉన్న సమయంలో ఆ యువతులు షాపింగ్ లో ఏవైనా అనుమానాలు వస్తే సాయం చేస్తారు. అలాగే మనకి కావాల్సిన సహాయం కూడా చేస్తారు. గర్ల్ ఫ్రెండ్ లను లంచ్ డేట్కు తీసుకెళ్లే సౌకర్యాన్నికూడా మాల్ కల్పిస్తోంది. అయితే దానికోసం రెండు నిబంధనలు పెట్టారు. గర్ల్ఫ్రెండ్గా తీసుకెళ్లినవారిని ముట్టుకోకూడదు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంగణం దాటి ఎక్కడికీ తీసుకెళ్లకూడదంటూ నిబంధనలు కూడా ఉన్నాయి. అన్ని బాగున్నప్పటికీ ఈ నిబంధనలు పెట్టడం తో కొంతమంది యువత కొంత నిరుత్సహానికి గురౌతున్నారు.

0 Comments:

Post a Comment

Welcome to Your Comments

Popular Posts

Recent Posts