Monday, November 11, 2013

సంప్రదాయంగా ఉద్యోగ నిర్వహణ ద్వారా ఆదాయం సంపాదించడం ఓ మార్గమనుకోండి ! మీరు ఒక కంపెనీ కోసం పని చేయడం ద్వారా గానీ, మీరే ఒక కంపెనీని ప్రారంభించడం ద్వారా గానీ ఆదాయం పొందడం సాధారణంగా జరిగేదే. ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటూ అధిక ఆదాయాన్ని సంపాదించేందుకూ మార్గాలున్నాయి. ఆన్‌లైన్‌లో ఆదాయం పొందాలంటే సృజనాత్మకత, చురుకుదనం, సమయానుకూల స్పందన ఉంటే చాలు... ఆపై దూసుకుపోవచ్చు..!

ధానంగా అత్యధిక మంది తమ కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేస్తారు. దానివల్ల భౌతికంగా ప్రతి ఒక్కరి మధ్య ఐక్యతతో ఒక్కొక్కరి ఆలోచనలను సమీకృతం చేసి సంస్థ అభివృద్ధికి వాటిని వినియోగిస్తారు.

అతికొద్ది మంది మాత్రమే తమ ఇంటి వద్ద నుంచే ఆదాయ సంపాదనకు మార్గాలు వెతు కుతుంటారు. ప్ర స్తుత ఆధునిక సమాజంలో అటువంటి మార్గాల్లో ఇంటర్‌నెట్‌, ఆదాయ సంపాదనకు పలు మార్గాలు ఉన్నాయి

కొద్ది సేపు పని చేసి స్వల్ప మొత్తంలో అదనపు ఆదాయం సంపాదించాలనుకునే వారికి కొన్ని సంస్థలు ఉపయుక్తంగా ఉంటాయి. అయితే ఇంటర్‌నెట్‌పై పూర్తిగా ఆధార పడి ఆదాయం సంపాదించిన వారి విజయ గాధలు కూడా గణనీయంగానే ఉన్నాయి. ఇంటర్‌నెట్‌ ద్వారా ఆదాయ సంపాదనకు అయిదు మార్గాలున్నాయి. ఇక ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లడమే.

ఈ - బేలో వస్తువుల విక్రయం

వెబ్‌సైట్‌ ద్వారా ఆదాయ సంపాదనకు ఆన్‌లైన్‌లో వస్తువుల విక్రయం ఒకటి. మీరు విక్రయించే వస్తువుల ఎంపికలో నిష్ణాతులు కావడమే ఇందులో కీలకం. నేరుగా ఆన్‌లైన్‌లో ప్రొఫైల్‌ సృష్టించుకుని వస్తు విక్రయం ప్రారంభించడమే. ప్రస్తుతం అందరికీ తెలిసిన దృక్పథమే ఇది. మీరు వస్తువుల పట్టికతో సిద్ధమైతే ఇదరులతో అవసరమే లేదు. ఇతరుల మాదిరిగా చాలా ఎక్కువ ధరలను నిర్ణయించకుండా ఆన్‌లైన్‌లో ఇ - బే వస్తువుల విక్రయానికి పెట్టడమే చేయాల్సింది. ఈ మార్గంలో ఫలితాలు రావడానికి కొద్దిగా సమయం పడుతుంది. ప్రేరణ కల్పించే విధంగా వస్తువుల జాబితా తయారు చేస్తే కొనుగోలు దారుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఆవెూద యోగ్యమైన బిడ్ల దాఖలుకు, అవసరమైన వినియోగదారులు కొనుగోలు చేయడానికి జాబితా తయారీ ముఖ్యం. అయితే ఆన్‌లైన్‌లో బుక చేసుకున్న తరువాత వినియోగ దారుడికి సకాలంలో వస్తువు పంపిణీ చేయడం ద్వారా సానుకూల పరిణామాలు ఏర్పడతాయి. కొనుగోలు దారులు తమ తోటి వారితో ఇ - బే విక్రయాల సమాచారం చేరవేయడం ద్వారా ప్రజా సంబంధాలు మెరుగవుతాయి. మీ వస్తువుల ధరలు, మీరు ఇచ్చే సర్వీసు కూడా కొనుగోలు దారులు తమ తోటి వారికి తెలియ చేయడం ఇ - బే వ్యాపారులకు లాభించే అంశం. తద్వారా ఆన్‌లైన్‌లో మీ విక్రయాలు వృద్ధి చెందుతాయి. ఇది నిరంతర ప్రక్రియగా సాగుతుంది.

బ్లాగింగ్‌

ఏదైనా చేయాలన్న తపన గానీ, అలవాటు గానీ, ఆలోచన గానీ ఉంటే బ్లాగింగ్‌ కూడా మీకు ఆదాయ మార్గమే అవుతుంది. ఇతర సర్వీసుల కంటే ఇంటర్‌నెట్‌లో బ్లాగింగ్‌ సేవల్లో కీలకమైందిదే. ఆన్‌లైన్‌లో వచ్చే వాణిజ్య ప్రకటనలను బ్లాగ్‌ విక్రయింప చేస్తుంది. అదెలా అంటే ..... మీరు వ్యక్తిగత బ్లాగ్‌ ఏర్పాటు చేస్తారు. గూగుల్‌యాడ్‌సెన్స్‌ తరహాలో పలువురు రచయితలు తమ బ్లాగ్‌లు సైన్‌అప్‌ చేసుకుంటారు. మీరు తరుచుగా బ్లాగ్‌ను సందర్శించి నప్పుడల్లా సదరు వెబ్‌సైట్లలో పేజీ పక్కన ఆయా స్పాన్సర్ల వాణిజ్య ప్రకటనలను చూస్తే స్పాన్సర్లెవ్వరూ అన్న విషయం తెలిసి పోతుంది. పలు దఫాలు మీ బ్లాగ్‌ను చదివే వారు ఆ పేజీ పక్కనే ఉన్న వాణిజ్య ప్రకటనను క్లిక చేయడం వల్ల ఆ ప్రకటనలోని వస్తువేమిటో తెలుసుకోవ డమూ ఒక రకమైన ప్రచారమే అవుతుంది. సాధారణ బ్లాగర్‌ అయిన మీరు మరింత డబ్బు ఖర్చు చేయడానికి ముందుకు వస్తే ఈ తరహా పనులన్నీ భేషుగ్గా ఉంటాయి. మీరు రాసే కథనాలతో మీ బ్లాగ్‌ నిరంతరాయంగా ఆసక్తి కలిగిస్తుంటే మీకు ఆన్‌లైన్‌లో ఉన్న అభిమానుల మనస్సు చూరగొనేందుకు వివిధ కంపెనీలు మీ ముందు క్యూ కడతాయి. మీ బ్లాగ్‌లో వాణిజ్య ప్రకటనలు జారీ చేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తాయి.

టి షర్టుల రూపకల్పన - విక్రయం
ఫోటో షాప్‌ వంటి ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా మీరు స్వంతంగా టి - షర్టులు రూపొందించండి. కొన్ని వెబ్‌సైట్లు మిమ్మల్ని సంప్రదించి ఆయా టి - షర్టుల డిజైన్లు తెలుసుకుంటాయి. మార్కెట్‌లో ఆ డిజైన్లతో కూడిన టి - షర్టుల విక్రయం తర్వాత వచ్చే లాభాలు మీకు పంచుతాయి. ఆఫ్‌బీట్‌ డిజైన్‌ వేసుకోవడానికి విద్యార్థులు, యువకులు ఆసక్తి కనబరుస్తుంటారు. మీరు ఒక స్కూల్‌ లేదా, కళాశాల క్యాంపస్‌కు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడితే కావాల్సినంత సమాచారం లభ్యమవుతుంది. ఈ సమాచారం పాఠ్య పుస్తకాల్లో గానీ, టర్మ్‌ ప్రశ్నా ప్రతాల్లో గానీ లభించదు. విద్యార్థులతో ఇష్టాగోష్టి నుంచి లభించే ఈ సమాచారానికి ఇంటి వద్ద పదును పెడితే కావల్సినన్ని డిజైన్లు లభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌లో టి షర్టుల విక్రయం క్రమంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కెఫెప్రెస్‌ డాట్‌ కామ్‌, స్ప్రెడ్‌షర్ట్‌ డాట్‌ కామ్‌ వంటి వెబ్‌సైట్లలో ఒక స్టోర్‌ ఏర్పాటు చేసుకుని, మీ డిజైన్లను విక్రయానికి పెట్టండి. మీకున్న తెలివి తేటలతో మీరు స్వయంగా తయారు చేసిన డిజైన్‌ పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందిస్తే చాలు మీకు ఆదాయం రావడం మొదలవుతుంది.

ఫ్రీలాన్సింగ్‌

ఫ్రీలాన్సింగ్‌ కూడా బ్లాగింగ్‌ వంటిదే. అయితే ఒక్క విషయం మీరు మీ ఇంట్లో గానీ, మీ ఆఫీసులో గానీ అత్యధిక సమయం పని చేస్తారు. అక్కడ కొన్ని విశిష్టతలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్‌ రైటింగ్‌ గురించి ఆలోచిస్తే బ్లాగర్‌కంటే ఎక్కువగా అనుభవం కలిగి ఉండాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ పబ్లికేషన్స్‌లో ఫ్రీలాన్సింగ్‌ రైటర్లు తమకు తెలిసిన విషయాల్లో ప్రత్యేకాంశాలను తీసుకుంటారు. ఆహారం, ప్రయాణం వంటి అంశాలను ఫ్యాషనేట్‌ పద్దతుల్లో యోచిస్తే ఎలా రాయాలన్న ఆలోచన తడుతుంది. తద్వారా ఫ్రీలాన్సింగ్‌ రచన ద్వారా ఆదాయం లభిస్తుంది. రచనలు మాత్రమే ఫ్రీలాన్సింగ్‌లో డబ్బు సంపాదించి పెట్టవు. గ్రాఫిక డిజైనింగ్‌ / ప్రోగ్రామింగ్‌ ఎక్సపీరియన్స్‌ కూడా కాంట్రాక్ట ఉద్యోగాలను తెచ్చి పెడతాయి.

డొమైన్‌ నేమ్‌ ప్లిప్పింగ్‌

చేయతలపెట్టిన వ్యాపారంలో అనుసరించే వ్యూహంతోపాటు అదృష్టాన్ని బట్టి విజయావకాశాలున్నాయి. ఆన్‌లైన్‌లో డొమైన్‌ పేరు గల వెబ్‌సైట్‌ కొనుగోలు కూడా డబ్బు సంపాదించే మార్గం. తక్కువ విలువ పలికే, పాత ఇళ్ల క్రయ విక్రయాల్లో ఆధునిక పోకడలతో వినియోగ దారులను ఆకట్టు కోవడం కీలకం. పాత ఇంటికైనా, తక్కువ ధర పలికే ఇంటికైనా ఆసక్తి గొలిపే రూపం కల్పించి అధిక ధరలకు విక్రయించడం.అయితే ఆన్‌లైన్‌లో కాలం చెల్లిన ఇల్లు, పాత ఇల్లు స్థానంలో ఒక వెబ్‌సైట్‌ 'మెయిల్‌ చిరునామా' కీలకం. వెబ్‌సైట్ల అన్వేషణలో ఉన్న వారు సరిగ్గా వినియోగించని, పేలవంగా వినియోగిస్తున్న వెబ్‌సైట్ల ఆచూకీ తెలుసుకుని, వాటి యజమానుల నుంచి సరసమైన ధరకు కొనుగోలు చేయడం. సాధారణంగా అటువంటి వారు కొన్ని వందల్లో (లేదా) వేల డాలర్లు చెల్లించి డొమైన్‌ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం వల్ల సదరు వెబ్‌సైట్‌ ద్వారా మరింత వాణిజ్యం వృద్ధి చేస్తారు. డొమైన్‌ పేరు గల వెబ్‌సైట్‌కు తొలి దశలో వచ్చిన ఆదాయానికంటే పలు రెట్లు ఎక్కువగా తీసుకు వస్తారు. ఉదాహరణకు బర్డ్‌ - కేజ్‌ డాట్‌ కామ్‌ అనే పేరున్న డొమైన్‌ వెబ్‌సైట్‌ 2005లో 1800 డాలర్లకు కొనుగోలు చేసి రీ డిజైన్‌ చేసిన రెండేళ్ల తర్వాత మరో బర్డ్‌ కేజ్‌ వెండర్‌కు 1.73 లక్షల డాలర్లకు విక్రయించారు.

0 Comments:

Post a Comment

Welcome to Your Comments

Popular Posts

Recent Posts