Showing posts with label FACEBOOK INFO. Show all posts
Showing posts with label FACEBOOK INFO. Show all posts

Friday, March 6, 2020

Goodbye-To-WhatsApp-And-Facebook-----India-s-Own-Social-Media
వాట్సాప్ ఫేస్బుక్ కి గుడ్ బై ... ఇండియాలో సొంత సోషల్ మీడియా !

వాట్సాప్ ఫేస్బుక్ కి గుడ్ బై ... ఇండియాలో సొంత సోషల్ మీడియా !

సోషల్ మీడియా ... ప్రస్తుతం సమాజంలో అగ్రస్థానంలో ఉంది. ఏ విషయాన్ని అయినా క్షణాల వ్యవధిలో సమాచారాన్ని చేరవేస్తూ ఊహకందని రీతిలో దూసుకుపోతుంది. అయితే ఈ సోషల్ మీడియా వెబ్ సైట్స్ కి అమెరికా అమ్మలాంటిది. ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న సోషల్ మీడియా సంస్థలైన పేస్ బుక్ వాట్సాప్ ...అమెరికాకి చెందినవే. అయితే గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా హ్యాకింగ్ మరియు డేటా దొంగతనం కేసులు పెరుగుతున్న సమయంలో భారత ప్రభుత్వం సొంత సోషల్ మీడియాను రూపొందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు భారత్ కి ఎటువంటి సొంత సోషల్ మీడియా మాధ్యమాలు లేకపోవడం తో అటు వైపుగా అడుగులు వేస్తున్నట్టు టెక్ మహీంద్రా సీటీఓ జాతీయ భద్రతా నిపుణుడు అమిత్ దుబే తెలిపారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో దుబే మాట్లాడుతూ..దేశంలో సొంత ఫేస్బుక్ క్రిప్టోకరెన్సీ వాట్సాప్ లాంటి వాటిని రూపకల్పన చేయడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

వ్యక్తిగత డేటా భారీగా భారతదేశం నుండి బయటికి రావడంతో.. దేశంలో సామాజిక మాధ్యమాలకు సంబంధించిన కసరత్తు పూర్తయ్యిందని ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో డ్రాఫ్ట్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. చైనాలో వాట్సాప్ ఫేస్బుక్ పనిచేయదని దుబే తెలిపారు. పౌరుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. పౌరుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

Tuesday, December 2, 2014

ఫేస్ బుక్ అనేది అందరికీ ఈ రోజుల్లో కామన్ అయిపోయిన అతి పెద్ద సోషల్ నెట్ వర్క్. ఫేస్ బుక్ ద్వారా డైరెక్ట్ గా సంపాదించడానికి అవకాశం లేకున్నా పరోక్షంగా వందల రకాల మార్గాల ద్వారా సంపాదించవచ్చును.ఎందుకంటే ఫేస్ బుక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద మోస్ట్ పవర్ ఫుల్ సోషల్ నెట్ వర్క్ సైట్. దీంట్లో మీ అకౌంట్ ను ప్రాపర్ గా నడిపిస్తే, మీ యుట్యూబ్ చానెల్ లోని మీ వీడియోల యు.ర.ల్ కోడ్ కాపీ చేసి మీ ఫేస్ బుక్ అకౌంట్ లో పేస్ట్ చేసి అందరూ చూసేలా చేయవచ్చు. మీ ఫేస్ బుక్ లో ఎవరు మీ వీడియోలను చూసినా మీ గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్లో డబ్బు జమ అవుతుంది. ఇలా మీకు సంబంధించిన ఏ ప్రొడక్ట్ అయినా ఫేస్ బుక్ ద్వారా ప్రచారం కలిపించుకోవచ్చు. అందుకే మీకు ఇప్పటివరకు ఫేస్ బుక్ అకౌంట్ లేకుంటే తక్షణం, ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు తెలిసిన ప్రెండే అని అవసరం లేదు. వారిని,వీరిని అని తేడా లేకుండా ఎన్నెన్నో మార్గాల ద్వారా ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ సంఖ్యను పెంచుకుంటూ పోవచ్చు.వీరంతా మీ ఫ్రెండ్స్ అని కాదు. మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఏర్పరచుకుంటున్న బిజినెస్ ఫ్రెండ్స్ సర్కిల్ అని ఫీలవ్వండి చాలు. నాకు తెలిసి కొందరి ఫేస్ బుక్ అకౌంట్స్ లో వేలాది మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఫేస్ బుక్ అకౌంట్ హోల్డర్ వారందరినీ వ్యక్తిగతంగా ఎరుగకపోవచ్చు. కాని ఓ ఇరువైవేలు ఫ్రెండ్స్ ఉన్న ఫేస్ బుక్ అకౌంట్లో మీ యుట్యూబ్ చానెల్లోని వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియోను మీ ఫేస్ బుక్ అకౌంట్లోని ఫ్రెండ్స్ లో పావువంతు మంది చూసిన కూడా ఆ వీడియో ద్వారా మీకు ఎంత డబ్బు వస్తుందో ఊహించుకోవచ్చు. ఈవిధంగా మీరు మనసు పెట్టి ఆలోచిస్తే మీ ప్రొడక్ట్ ఏదైనా డిస్ ఫ్లే, సెల్లింగ్ చేయడానికి The Best Fowerful Social Media Network - Facebook.

Recent Posts