ఫేస్ బుక్ అనేది అందరికీ ఈ రోజుల్లో కామన్ అయిపోయిన అతి పెద్ద సోషల్ నెట్ వర్క్. ఫేస్ బుక్ ద్వారా డైరెక్ట్ గా సంపాదించడానికి అవకాశం లేకున్నా పరోక్షంగా వందల రకాల మార్గాల ద్వారా సంపాదించవచ్చును.ఎందుకంటే ఫేస్ బుక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద మోస్ట్ పవర్ ఫుల్ సోషల్ నెట్ వర్క్ సైట్. దీంట్లో మీ అకౌంట్ ను ప్రాపర్ గా నడిపిస్తే, మీ యుట్యూబ్ చానెల్ లోని మీ వీడియోల యు.ర.ల్ కోడ్ కాపీ చేసి మీ ఫేస్ బుక్ అకౌంట్ లో పేస్ట్ చేసి అందరూ చూసేలా చేయవచ్చు. మీ ఫేస్ బుక్ లో ఎవరు మీ వీడియోలను చూసినా మీ గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్లో డబ్బు జమ అవుతుంది. ఇలా మీకు సంబంధించిన ఏ ప్రొడక్ట్ అయినా ఫేస్ బుక్ ద్వారా ప్రచారం కలిపించుకోవచ్చు. అందుకే మీకు ఇప్పటివరకు ఫేస్ బుక్ అకౌంట్ లేకుంటే తక్షణం, ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు తెలిసిన ప్రెండే అని అవసరం లేదు. వారిని,వీరిని అని తేడా లేకుండా ఎన్నెన్నో మార్గాల ద్వారా ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ సంఖ్యను పెంచుకుంటూ పోవచ్చు.వీరంతా మీ ఫ్రెండ్స్ అని కాదు. మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఏర్పరచుకుంటున్న బిజినెస్ ఫ్రెండ్స్ సర్కిల్ అని ఫీలవ్వండి చాలు. నాకు తెలిసి కొందరి ఫేస్ బుక్ అకౌంట్స్ లో వేలాది మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఫేస్ బుక్ అకౌంట్ హోల్డర్ వారందరినీ వ్యక్తిగతంగా ఎరుగకపోవచ్చు. కాని ఓ ఇరువైవేలు ఫ్రెండ్స్ ఉన్న ఫేస్ బుక్ అకౌంట్లో మీ యుట్యూబ్ చానెల్లోని వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియోను మీ ఫేస్ బుక్ అకౌంట్లోని ఫ్రెండ్స్ లో పావువంతు మంది చూసిన కూడా ఆ వీడియో ద్వారా మీకు ఎంత డబ్బు వస్తుందో ఊహించుకోవచ్చు. ఈవిధంగా మీరు మనసు పెట్టి ఆలోచిస్తే మీ ప్రొడక్ట్ ఏదైనా డిస్ ఫ్లే, సెల్లింగ్ చేయడానికి The Best Fowerful Social Media Network - Facebook.
Tuesday, December 2, 2014
Subscribe to:
Post Comments (Atom)
Sakshyam Education.jpg)
0 Comments:
Post a Comment
Welcome to Your Comments