అంబానీ ఔట్.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా జక్ మా |
అంబానీ ఔట్.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా జక్ మా
ఓ వైపు కరోనా ఎఫ్టెక్.. మరో వైపు ముడి చమురు ధరల పతనం తో ఈక్వెటీ షేర్లు కుప్పకూలడంతో ప్రపంచ కుబేరుల స్థానాలు మారిపోయాయి. ఇప్పటివరకూ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న భారత నంబర్ 1 కుబేరుడు ముకేష్ అంబానీ తాజాగా స్థానాన్ని కోల్పోయారు.సోమవారం షేర్ మార్కెట్ కుదేలవడం తో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నికర సంపద విలువ ఏకంగా 580 కోట్ల డాలర్లు నష్టపోయాడు. దీంతో సంపద తగ్గిపోయింది. ఇక ఈ సమయంలో రెండో స్థానంలో ఉన్న అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా నంబర్ 1లోకి వచ్చారు. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ వివరాలు వెల్లడించింది.
ముఖేష్ అంబానీ కంటే జాక్ మా సంపద ఇప్పుడు 260 కోట్ల డాలర్లు ఎక్కువగా ఉంది. 4450కోట్ల డాలర్లతో జాక్ మా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
కరోనా భయాలు వెంటాడడం.. 30 ఏళ్ల కనిష్ట స్థాయిలో ముడిచమురు ధరలు పడిపోవడం తో ప్రపంచంలోని మార్కెట్లన్నీ కుప్పకూలిన సంగతి తెలిసిందే.
0 Comments:
Post a Comment
Welcome to Your Comments