New Post office scheme | పోస్ట్ ఆఫీస్ కొత్త స్కీమ్ 2000 పెట్టడంతో మీకు 2.5 లక్షలు
ప్రభుత్వ రంగ ఇండియా పోస్ట్ తన పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. పోస్టాఫీస్ 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ కూడా ఇందులో ఒకటి. పోస్టాఫీస్ 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ను నెలకు రూ.10 కనీస మొత్తంతో కూడా ప్రారంభించొచ్చు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌పై వార్షికంగా 7.3 శాతం వడ్డీ పొందొచ్చు. వడ్డీ ప్రతి 3 నెలలకు ఒకసారి మన డిపాజిట్ మొత్తంతో కలుపుతారు. ఇది ఎక్కువ రాబడి పొందొచ్చు. దీర్ఘకాలంలో చూస్తే.. రికరింగ్ డిపాజిట్‌లో ప్రతి నెలా కనీస మొత్తం రూ.10 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెలితే ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయానికి రూ.725.05 సమకూరుతుంది.
నగదు లేదా చెక్ రూపంలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌ను ప్రారంభించొచ్చు. చెక్ రూపంలో డిపాజిట్ చేస్తే.. చెక్ క్రెడిట్ అయిన రోజును డిపాజిట్ తేదీగా పరిగణలోకి తీసుకుంటారు.
ఏ పోస్టాఫీస్‌లోనైనా ఎవరైనా ఈ అకౌంట్‌ను ప్రారంభించొచ్చు. ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవొచ్చు. అలాగే పిల్లల పేరు మీద కూడా ఖాతాను ప్రారంభించొచ్చు. పదేళ్లు లేదా ఆపైన వయసున్న పిల్లలు వారి ఖాతాను వారే నిర్వహించుకోవచ్చు.
రికరింగ్ డిపాజిట్‌ను ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్‌కు మార్చుకోవచ్చు. సింగిల్ అకౌంట్‌ను జాయింట్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు.
అకౌంట్ ప్రారంభించిన ఏడాది తర్వాత ఖాతాలో 50 శాతం వరకు డబ్బుల్ని వెనక్కు తీసుకోవచ్చు. తర్వాత మళ్లీ దీన్ని కట్టేయాలి.
0 Comments:
Post a Comment
Welcome to Your Comments