SBI Good News: ఈఎంఐ చెల్లించారా? వెనక్కి తీసుకోండి ఇలా
★SBI options on EMI moratorium
★ఈఎంఐ చెల్లింపుల విషయంలో కస్టమర్లకు మూడు ఆప్షన్స్ ఉంటాయి.
★1. ఈఎంఐ మారటోరియం వాడుకోవద్దనుకునే కస్టమర్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పట్లాగే వారి అకౌంట్ నుంచి ఈఎంఐ డిడక్ట్ అవుతుంది. లేదా కస్టమర్లు ఈఎంఐ చెల్లిస్తే చాలు.
★2. ఈఎంఐ మారటోరియం కోరుకునేవారు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈఎంఐలు నేషనల్ ఆటోమెటెడ్ క్లియరింగ్ హౌజ్-NACH ద్వారా ఆటో డెబిట్ అవుతుంటాయి. అందుకే (Annexure-II) దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి (Annexure-III) లో ఉన్న ఇమెయిల్ ఐడీకి పంపాలి.
★3. ఇప్పటికే అంటే మార్చి 1 నుంచి ఇప్పటి వరకు ఈఎంఐ చెల్లించినట్టైతే వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం (Annexure-I) అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి (Annexure-III) లోని ఇమెయిల్ ఐడీకి పంపాలి.
★ఈఎఐ రీఫండ్ 7 వర్కింగ్ డేస్‌లో అకౌంట్‌లోకి వస్తుంది. మారటోరియం ఎంచుకున్నవారు మూడు నెలలు వాయిదా వేసుకోవచ్చు. ఈఎంఐ చెల్లించనందుకు క్రెడిట్ స్కోర్‌కు ఇబ్బందేమీ ఉండదు. కానీ ఔట్‌స్టాండింగ్ ఎంత ఉందో దానికి వడ్డీ మాత్రం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
★ ఉదాహరణకు ఆటో లోన్ రూ.6 లక్షలు తీసుకుంటే ఇంకో 54 నెలలు చెల్లించాల్సి ఉందనుకుందాం. అదనంగా వడ్డీ రూ.19,000 చెల్లించాలి. హోమ్ లోన్ రూ.30 లక్షలు తీసుకుంటే మరో 15 ఏళ్లు చెల్లించాల్సి ఉందనుకుందాం. అదనంగా వడ్డీ రూ.2.34 లక్షల వరకు అవుతుందని ఎస్‌బీఐ లెక్కేసి మరీ చెప్పింది. కాబట్టి డబ్బులు ఉన్నవారు మారటోరియం ఎంచుకోకుండా ఈఎంఐలు ఎప్పట్లాగే చెల్లించడం మంచిది.
0 Comments:
Post a Comment
Welcome to Your Comments