Sunday, June 21, 2020

ప్రపంచంలోనే టాప్ 9 సంపన్నుడిగా అంబానీ!
Mukesh-Ambani-joins-club-of-world-10-richest
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరుల జాబితా తాజాగా విడుదల అయ్యింది. ఇందులో ప్రపంచంలోనే నంబర్ 1 సంపన్నుడిగా అమెజాన్ అధినేత జెఫ్ బోజెస్ నిలిచారు.  ఇక భారత్ లోని నంబర్ 1 కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే 9వ స్థానంలో నిలివడం విశేషం. ప్రపంచంలోనే 9వ అపర కుబేరుడిగా అంబానీ నిలవడం భారత ప్రతిష్టను ఇనుమడింపచేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పక్కనున్న చైనా నుంచి టాప్ 10 ఒక్క కుబేరుడు కూడా లేకపోవడం.. మనపైన ఆధిపత్యం చెలాయిస్తున్న చైనాకు ఇది షాకింగ్ మారింది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే  బిలియనీర్లలో భారత దేశం మూడో స్థానంలో నిలిచిందని హురున్ గ్లోబల్ రిచ్ 2020 అనే జాబితా వెల్లడించింది. వీరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత  చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ భారత్ లో అగ్రస్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ సంపద విలువ ఏకంగా 6700 కోట్ల డాలర్లుకు చేరడం విశేషం.  

ఇక ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కాగా.. నంబర్ 2 స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ నిలిచారు. ఇక మూడో స్థానంలో ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ అర్నాల్ట్ చోటు దక్కించుకున్నాడు.

ఇక ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ ప్రపంచంలోని కుబేరుల్లో  4వ స్థానంలో నిలిచాడు. ఇక హాత్ వే చైర్మన్ వారెన్ బఫెట్ 5వ స్థానంలో .. మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బామర్ 6వ స్థానంలో నిలిచాడు.

ఏడో స్థానంలో ఓరాకిల్ ఓనర్ లారీ ఎలిసన్-అమెరికా..
8వ స్థానంలో అమాన్సియో ఒర్టేగా (ఇండిటెక్స్ కో ఫౌండర్ స్పెయిన్) ..
 9వ స్థానంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ-భారత్..
 10వ స్థానంలో గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ కో ఫౌండర్- అమెరికా నిలిచాడు.

*కొసమెరుపు ఏంటంటే టాప్ 10 ప్రపంచపు సంపన్నుల జాబితాలో అమెరికాకు చెందిన వారే ఏడుగురు ఉండడం విశేషం. ఫ్రాన్స్ స్పెయిన్ భారత్ నుంచి ఒక్కొక్కరు ఉండడం గమనార్హం.

0 Comments:

Post a Comment

Welcome to Your Comments

Popular Posts

Recent Posts