Sunday, April 5, 2020



కరోనా ఎఫెక్ట్...మళ్లీ రైతు రాజ్యం రాబోతోందా?

Agriculture-In-main-Stream-After-China-virus-Corona
కరోనా ఎఫెక్ట్...మళ్లీ రైతు రాజ్యం రాబోతోందా?
ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న ప్రాణాంతక వైరస్ కోవిడ్-19 మానవ జీవన గమనాన్నే మార్చేస్తుందన్న వాదనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతంలో ప్రపంచంపై విరుచుకుపడ్డ వైరస్ ల మాదిరిగానే కరోనాను కూడా నియంత్రించిన తర్వాత మానవ జీవితం యథాతధంగానే మారిపోతుందన్న వాదనలు అస్సలు వినిపించడం లేదు. కరోనా విజృంభిస్తున్న తీరు - ప్రజల ప్రాణాలను హరిస్తున్న తీరు - దాదాపుగా అన్ని రంగాలను కుదేలు చేస్తున్న తీరు చూస్తుంటే... మానవ జీవన గమనాన్ని కరోనా సమూలంగా మార్చివేయడం ఖాయమేనన్న వాదనలకు బలం చేకూరుతోంది. అంతేకాకుండా గతంలో ప్రధాన రంగంగా విలసిల్లిన వ్యవసాయం... కరోనా అనంతరం మరోమారు కీలక రంగంగానే కాకుండా అందరూ ఇష్టపడి మరీ దిగిపోయే రంగంగా.. మొత్తంగా అత్యంత ప్రాధాన్యతా రంగంగా మారిపోవడం ఖాయమని - వెరసి మరోమారు రైతు రాజ్యం వచ్చేసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ దిశగా మరోమారు రైతు రాజ్యం రాబోతోందన్న వాదనలకు ఆసక్తికర ఉదాహరణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా అమెరికా ఏ మేర విలవిల్లాడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా కారణంగా గతంలో ఎన్నడూ ఎదుర్కొనన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్న అమెరికా... భవిష్యత్తులో కూడా ఈ తరహా పరిణామాలను చూడబోదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన వేళ.. అత్యంత ఎక్కువ ప్రభావిత దేశంగా మారిన అమెరికా కూడా లాక్ డౌన్ ప్రకటించక తప్పలేదు. వెరసి ఇతర ప్రపంచ దేశాల మాదిరే అమెరికా ఆర్థిక పరిస్థితి బాగా దిగజారడం గ్యారెంటీనే. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోయిన అమెరికా.. కరోనా తోక ముడిచే నాటికి మరింతగా నష్టం చవిచూడనుంది. ఉపాధి కోసం అమెరికా అంటే ఎగబడిన ఇతర దేశాల జనం.. ఇప్పుడు ఆ దేశం ముఖం చూసేందుకే భయపడిపోక తప్పదు.



అంటే... అమెరికా సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిరపడేందుకు - అక్కడి ఉపాధితో ఇబ్బడిముబ్బడిగా ఆదాయాన్ని పోగేసుకుందుకు ఆసక్తి చూపిన వారంతా ఇప్పుడు వాటి వైపు చూడాలంటేనే భయపడిపోవడం ఖాయమే. ఇతర దేశాల మాటెలా ఉన్నా... భారత్ లో అయితే ఈ తరహా పరిస్థితి చాలా స్పష్టంగానే కనిపించే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే వ్యవసాయమే ప్రధానంగా సాగుతున్న భారత్ లో 70 శాతంగా ఉన్న పల్లెలకు జీవనోపాధి వ్యవసాయమే. అయితే పట్టణీకరణలో భాగంగా ఇప్పుడు పల్లెల్లో జనం తగ్గుతుండగా... పట్టణాల్లో జనం పెరుగుతున్నారు. పట్టణాల నుంచి అమెరికా లాంటి దేశాలకు వలస పోతున్నారు. కరోనా ప్రభావంతో ఈ పోకలంతా తగ్గిపోగా... సొంతూళ్లకు తిరిగి రాకలు మరింతగా పెరిగిపోవడం ఖాయమే. సొంతూళ్లకు వచ్చే వారంతా వ్యవసాయంతో దృష్టి సారించడం కూడా ఖాయమే. మొత్తంగా ఇప్పుడు బాగా బక్కచిక్కిపోయిన రైతు...కరోనా తదనంతర పరిస్థితుల్లో బలంగా మారడం ఖాయమేనని చెప్పక తప్పదు.

0 Comments:

Post a Comment

Welcome to Your Comments

Popular Posts

Recent Posts