Thursday, April 2, 2020


'కరోనా వైరస్' ఆర్థిక మాంద్యం...నెవ్వర్ బిఫోర్...ఎవ్వర్ ఆఫ్టర్
China-Virus-Corona-Effec-On-World-Economy-Is-Unimaganable
'కరోనా వైరస్' ఆర్థిక మాంద్యం...నెవ్వర్ బిఫోర్...ఎవ్వర్ ఆఫ్టర్
కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రపంచ దేశాల లో చాలా వరకు లాక్ డౌన్ విధించుకున్నాయి. తమ దేశ ఆర్థిక వ్యవస్థలు...జీడీపీలు...డాలర్ తో తమ కరెన్సీ మారక విలువలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో లాక్ డౌన్ చేశాయి. భారత్ వంటి డెవలపింగ్ కంట్రీస్ పై లాక్ డౌన్ ఎఫెక్ట్ ఇప్పటికే ప్రారంభమైంది. లాక్ డౌన్ విధించిన వారం రోజులకే వలస కూలీలు దినసరి వేతనదారులు దిగువ మధ్య తరగతి మధ్య తరగతి వారి ఆర్థిక స్థితి దయనీయంగా మారింది. దాదాపుగా భారత్ తో పాటు అమెరికా వంటి డెవలప్డ్ కంట్రీస్ లో కూడా భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం తప్పదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా తీవ్రత తగ్గిన కొద్ది నెలల్లో అంతా సర్దుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే గత ఆర్థిక మాంద్యాలతో పోలిస్తే కరోనా వల్ల రాబోతోన్న ఆర్థిక మాంద్యం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని...కరోనా ఆర్థిక మాంద్యం ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమని హార్వర్డ్ ఆర్థికవేత్త మరియు ఆర్థిక సంక్షోభాల చరిత్ర రచయిత కెన్నెత్ ఎస్ రోగాఫ్ హెచ్చరిస్తున్నారు.

ఆర్థిక వ్యవస్థలోని లోపాలు తదితర కారణాల వల్ల దాదాపు 11 సంవత్సరాల క్రితం ఆర్థిక మాంద్యం వచ్చిందని కాబట్టే రెండేళ్లలోనే ఆ మాంద్యం మొత్తం కనుమరుగైందని రోగాఫ్ చెబుతున్నారు. అయితే కరోనా వల్ల రాబోయే మాంద్యం పర్యవసానాలు వేరని వార్నింగ్ ఇస్తున్నారు. కరోనా వల్ల హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిందని మనిషిని మనిషి సోకితే వ్యాధి తిరగబెట్టే ప్రమాదముందన్న నేపథ్యంలో వ్యాపారాలు అంత సులువుగా గాడిన పడవని చెబుతున్నారు. వైరస్ భయం వల్ల భారీ జనసంచారం...జనం గుమిగూడే పనులు జరగవని ఫ్యాక్టరీల్లో కూడా రిసెషన్ తప్పదని రెస్టారెంట్లు కాన్సర్ట్ లకు ప్రజలు హాజరు కారని అన్నారు. ఇక కొంతకాలం వరకు విదేశాలకు వెళ్లేందుకు పెద్దగా ఎవరూ మొగ్గు చూరని విమానయాన కంపెనీలు టూరిజం ఆధారిత దేశాలు నష్టపోతాయని చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచ స్టాక్ మార్కెట్ల పతనాన్ని శాసించిన కరోనా...మున్ముందూ కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులు అత్యధికంగా అమ్మకాలవైపే మొగ్గు చూపుతారని దీంతో ఆర్థిక సంక్షోభం మరింత ఎక్కువవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. గత శతాబ్ధంలోనే ఆధునిక ప్రపంచం చూసిన అతిపెద్ద ముప్పు కరోనా అని రోగాఫ్ అభిప్రాయపడుతున్నారు. ప్రతిసారీ ఆర్థిక సంక్షోభం ఎంతకాలం ఉంటుందో నిపుణలకు అంచనా ఉండేదని కానీ కరోనా వల్ల వచ్చే మాంద్యం మాత్రం అంచనాలకు అందకపోవడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల లో ఆర్థిక మాంద్యం దెబ్బ మరింత గట్టిగా పడుతుందని చెబుతున్నారు.ఇప్పటికే మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారని . కరెన్సీల విలువలు క్షీణించడం మంచి పరిణామం కాదని చెబుతున్నారు. ఇదే సమయంలో కరెన్సీ విలువ ఒక్కటి మాత్రమే పెట్టుబడిదారులలో కాస్తంత ఆశాజనక దృక్పథానికి కారణం అవుతోంది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత భారీగా ఉద్యోగాల్లో కోత ఉంటుందని అప్పుడు ప్రజలు ఖర్చుకు వెనుకాడితే విస్తరణ పరిమితం అయి వృద్ధి కుదేలవుతుందని అన్నారు. కరోనాపై ప్రజల్లో పడిన ముద్ర ఒక్కసారిగా తొలగిపోదని రికవరీ చాలా నిదానంగా ఉంటుందని ప్రజల్లో మారే ప్రవర్తనా విధానం తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు ఎంతో సమయం పట్టవచ్చని చెప్పారు. ఐక్యరాజ్యసమితి 2.5 ట్రిలియన్ డాలర్లను అంతర్జాతీయ ద్రవ్య నిధి 1 ట్రిలియన్ డాలర్లను అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయం చేసేందుకు హామీ ఇచ్చిందని తమ వద్ద ఉన్న మొత్తం నిధినీ కరోనా చూపే ప్రభావం నుంచి ప్రపంచం బయటపడేందుకు వినియోగిస్తామని ఐఎంఎఫ్ ఇప్పటికే ప్రకటించిందని చెప్పారు. ఇది కొంచెం ఊరట కలిగించినా.... అభివృద్ధి చెందిన దేశాలకు కరోనా హెల్త్ షాక్ ఇంకా తగల్లేదని అన్నారు.

0 Comments:

Post a Comment

Welcome to Your Comments

Popular Posts

Recent Posts